ఈ ప్రపంచంలో మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కష్టాలను అధిగమించడానికి ప్రజలు మొట్టమొదటిగా చేసే పని దేవుడికి ఉత్తమ కష్టాల గురించి మొరపెట్టుకోవటం. నిత్యం దేవుడికి పూజలు చేసి తమకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు. ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని తమ కష్టాలు తీరిపోతే మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది ప్రజలు తమ కష్టాల నుండి విముక్తి పొందటానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు.
అయితే ఆ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్లి వారు మొక్కిన మొక్కులను తీరుస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది ప్రజలు మాత్రం దేవుడికి ఇచ్చిన ప్రమాణం మరిచిపోయి మొక్కు గురించి ఆలోచన లేకుండా ఉంటారు. మరి కొంతమంది దేవుడి మొక్కు గురించి మరచిపోతారు. కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడు మొక్కు గుర్తు రానివారు మళ్లీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకువస్తుంది. అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా? పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తరువాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని,ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానం అని పండితులు చెబుతున్నారు. ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపం చూపించరు. అలాగే దేవుళ్లు కూడా భక్తులను కష్టాల పాలు చేయడు. అయితే కష్టాలు వచ్చినప్పుడు మనిషి దారి ఎటు ఉంది.. సుఖం వచ్చినప్పుడు ఎలా ఉంది.. మనిషి ఏ సమయంలో మాట మీద నిలబడుతున్నాడు అని ఎవరికి వారు తెలుసుకునేందుకే ఈ మొక్కు ఉపయోగపడుతుంది. మనిషి ఇచ్చిన మాటపై నిలబడుతున్నాడా.. లేదా.. అనే దాన్ని చెప్పేందుకే ఈ మొక్కులు వచ్చాయి అని పండితులు చెబుతున్నారు.