పక్షవాతం వచ్చేముందు కనిపించే లక్షణాలు ఇవే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

ప్రస్తుత కాలంలో పక్షవాతం బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గుర్తిస్తే మాత్రం వెంటనే వైద్య చికిత్స చేయించుకుంటే మంచిది. పక్షవాతం లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. తల తిరగడం, మైకం, అస్థిరత ఎక్కువ రోజుల పాటు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

కాళ్ళు, పాదాలు సహా శరీరం ఓ వైపు బలహీనత ఉంటే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. పదాలను తడబడుతూ చెప్పడం, మర్చిపోవడం కూడా పక్షవాతంకు సంకేతం అని చెప్పవచ్చు. చేతుల్లో బలహీనత ఉన్నా కూడా అతి పక్షవాతానికి ఒకే సంకేతంగా ఉంటుంది. ఆకస్మిక తీవ్ర తలనొప్పి కూడా పక్షవాతం లక్షణాలలో ఒకటి కావడం గమనార్హం. దృష్ఠి కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖం ఓ వైపుకే వంకరగా ఉన్నా, చిరునవ్వు సరిగ్గా లేకపోయినా చేయి బలహీనత, తిమ్మిరి లాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వైద్యులను సంప్రదించి సరైన వైద్య చికిత్స చేయించుకుంటే మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య చికిత్స తీసుకుంటే మంచిది.

మెదడు లోని ఓ భాగానికి రక్త ప్రసరణ కు అవరోధం ఏర్పడినా, ఆగిపోయినా పక్షవాతం రావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం ఏర్పడుతుంది. ధూమపానం, మద్యపానం మానుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పురుషులు రోజుకు 8 పెగ్గుల కంటే ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. శారీరక శ్రమ చేయని వాళ్లను కూడా ఈ సమస్య వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లకు సైతం పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.