సాధారణంగా ఇంట్లో ఒకరి దుస్తులు మరొకరు దరిస్తూ ఉంటారు. ఇంట్లో అక్కా చెల్లెలు, అన్నదమ్ములు వారి దుస్తులను ఒకరికొకరు మార్చుకొని ధరిస్తూ ఉంటారు. అలాగే హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న యువతీ యువకులు కూడా అప్పుడప్పుడు వారి ఫ్రెండ్స్ దుస్తులను ధరిస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి కూడా దుస్తులు కొంచెం పైకి అయితే చిన్నవారికి ఆ దుస్తులను వేస్తూ ఉంటారు. అలాగే పాతబడిన దుస్తులు పేదవారికి దానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఇతరుల దుస్తులు ధరించటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని పండితులు సూచిస్తున్నారు.
ఇలా ఇతరుల నుండి తీసుకున్న దుస్తులు ధరించటం వల్ల వారికి ఉన్న దోషాలు దుస్తులు తీసుకున్న వారికి కూడా తగిలి అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అలా తీసుకున్న తర్వాత కొంతమందికి వెంటనే వాటి చెడు ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ మనం ఉపయోగించిన దుస్తులను ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది. కానీ కొత్త దుస్తులు ధరించడం వల్ల ఇటువంటి పరిణామాలు సంభవించవు. ఒకవేళ మనం ఉపయోగించిన బట్టలను ఇతరులకు ఇవ్వాల్సి వస్తే అటువంటి సమయంలో ఉప్పు నీళ్లతో నింపిన బకెట్లో వేసి దాదాపు ఒకరోజు నానబెట్టి ఆ తర్వాత బట్టలు ఆరిపోయిన తర్వాత ఇతరులకు ఇవ్వవచ్చు. ఇలా చేయటం వల్ల మనకు ఉన్న దోషాలు ఇతరులకు రావు.
అలాగే కొన్ని సార్లు మనం మన పాత బట్టలను చెత్తబుట్టలో పడేయటం లేదా రోడ్డు మీద వెళ్లే వారికి దానం చేస్తూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాలలో అలా చేయడం వల్ల కూడా మనకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బాగుపడటం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు మన పాత దుస్తులను తీసుకొని వాటిని ఉపయోగించి చేతబడి చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మన పాత దుస్తులను ఇల్లు తుడవడానికి, వాహనాలు తుడవటానికి,వంట గదిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం వాటిని ఉప్పు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాతే ఇంటి పనులకు ఉపయోగించాలి. అందుకే మన బట్టలను కనుక ఉప్పు నీళ్లలో వేసి ఆరిన తరువాత వాటిని ఉపయోగిస్తే ఎలాంటి బాధలు, ధోషాలు, ఉండవు. అందువల్ల పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీళ్లలో ఒకరోజు మొత్తం నానబెట్టి ఆ తర్వాత ఇతరులకు దానం చేయాలి.