మహిళలలో పెరుగుతున్న కాలేయ వ్యాధుల ముప్పు.. ఈ సమస్యలకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో మహిళలలో చాలామంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటనే సంగతి తెలిసిందే. మన శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో లివర్ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ తోడ్పడుతుంది. ఆహారం జీర్ణమైన తర్వాత శరీరానికి హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను అందించే విషయంలో లివర్ సహాయపడుతుంది.

ఇమ్యూనిటీ పవర్, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో లివర్ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల లివర్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మహిళల్లో కాలేయ సమస్యలకు కారణమవుతుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ సమస్య వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఆల్కహాలిక్ లివర్‌ సమస్య వల్ల కూడా కొన్నిసార్లు కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాడుతున్న మందుల వల్ల కూడా కొన్నిసార్లు కాలేయ సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. గర్భధారణ సంబంధిత కాలేయ సమస్యల వల్ల కొన్నిసార్లు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

విల్సన్, ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ సమస్యలు సైతం కొన్ని సందర్భాల్లో కాలేయ సంబంధిత సమస్యలకు కారణమవుతాయని చెప్పవచ్చు. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే ఆ సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.