ముసలితనం అనేది కనపడకుండా కాస్త యవ్వనంగా కనపడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకోసం రకరకాల ప్రయత్నాలు జుట్టుకు రంగేయడం, ముఖానికి రకరకాల క్రీములు వాడడం లాంటివి చేస్తూ ఉంటాం. కొందరైతే తక్కువ వయసున్న కూడా ముసలి వారు లాగా కనపడుతుంటారు. దీనికి గల కారణాలు మన ఆహారంలోని మార్పులే.
చక్కగా మనం తీసుకునే ఆహారంలో కాస్త మార్పులు చేర్పులు జరిగినట్లయితే యవ్వనంగా కనపడవచ్చు అంటారు వైద్య నిపుణులు. మన కణజాలాల జీవితకాలం 120 రోజులు కానీ అవి 60 నుంచి 70 రోజుల్లోనే చనిపోవడం జరుగుతుంది. చర్మం లోని కణాల మార్పు వల్లే యవ్వనంగా కనిపించను. మనం తినే ఆహారం వాటిని తయారు చేయడానికి సరిపోతుంది. దీనికి ఆహారంలోపమే కారణం.
ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఇది కూడా రోజుకి ఒక పూట మధ్యాహ్నం మాత్రమే తీసుకుంటే మరీ మంచిది. ఉదయం సాయంత్రం సహజంగా లభించే పండ్లు, జ్యూసులను ఆహారంగా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనబడుతుంది. చక్కగా ఉదయం నిద్ర లేచాక ఖాళీ కడుపుతో ఒక లీటర్ నీరు త్రాగి ఒక అరగంట వ్యాయామం లేదా నడవడం చేయాలి. తర్వాత ఆహారంగా పండ్లు లేదా జూసును ఎంచుకోవాలి.
మధ్యాహ్నం మనకు ఇష్టమైన ఆహారం తీసుకోవచ్చు. సాయంత్రం కూడా చేరుకు రసం, బత్తాయి రసం, దానిమ్మరసం లాంటి జ్యూసులను చక్కెర ఐస్ లేకుండా నాచురల్ గా తీసుకుంటే మంచి ఆరోగ్యం. రాత్రి డిన్నర్ లో నట్స్ లాంటివి నానబెట్టుకుని తీసుకుంటే మంచిది. జామపండు ను డిన్నర్ లో ఒక భాగంగా చేసుకోవాలి.
ఈ విధంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని కాస్త వ్యాయామం, యోగా లాంటివి అలవర్చుకుంటే శరీరంపై ముడతలు అనేవి త్వరగా రావు వయసు పెరిగినా కూడా యవ్వనంగానే కనిపిస్తూ ఉంటాము. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ చిట్కాలతో మంచి ఫలితం త్వరగా నే గమనించవచ్చు.