శాఖాహారులలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో విటమిన్ బీ12 లోపం కూడా ఒకటి. బీ12 లోపం ఉంటే అలసట, బలహీనత, చర్మం లేతగా లేదా పసుపుగా మారడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి, నడవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ బీ12 లోపం తీవ్రమైతే రక్తహీనత, నరాల నష్టం లాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి.
విటమిన్ బీ12 లోపం ఎక్కువగా ఉంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ లోపం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాకపోవడం వల్ల నీరసం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ బీ12 లోపం వల్ల నాడీ వ్యవస్థలో అనేక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. తిమ్మిర్లు సమస్య తరచుగా వేధిస్తుంటే బీ12 లోపం ఉండే అవకాశం అయితే ఉంటాయని చెప్పవచ్చు.
శరీరం రంగు మారుతున్నా కూడా విటమిన్ బీ12 లోపం అయ్యే అవకాశాలు ఉంటాయి. గోళ్ల రంగు మారుతుంటే కూడా విటమిన్ బీ12 లోపం రీజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లోపం వల్ల ఆకలి తగ్గి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సమస్య వల్ల కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా జాగ్రత్త వహిస్తే మంచిది.
విపరీతమైన అలసట లేదా బలహీనమైన అనుభూతి, వికారం, వాంతులు లేదా అతిసారం అనుభవించడం, చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు , నోటి పూతల కలిగి ఉండే బాధాకరమైన లేదా ఎరుపు నాలుక, నిస్పృహ మరియు ఉద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలి.