శరీరంలో యూరిక్ ఆసిడ్ తగ్గాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఏం చేయాలంటే?

మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మాత్రమే మనం ఏ పని చేసినా సులువుగా చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గౌట్, కిడ్నీలో రాళ్ళ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆరోగ్యానికి సరైన యూరిక్ యాసిడ్ యాసిడ్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడం కూడా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి.

యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ యొక్క జీర్ణక్రియ యొక్క ఉప ఉత్పత్తి కాగా మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలో యూరిక్ ఆసిడ్ చేరుతుంది. శరీరం యూరిక్ యాసిడ్‌ని బయటికి పంపించక పోతే అది రక్తంలో పేరుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటెమ్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే అవకాశం అయితే ఉంటుంది.

తక్కువ ప్యూరిన్ ఫుడ్స్ శరీరం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. బెల్‌పెప్పర్స్, దోసకాయలు, క్యారెట్స్, ఆకుకూరలు, కూరగాయల్లో ప్యూరిన్స్ తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వారు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. మందులు తీసుకోవడం ద్వారా మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

చెర్రీస్ తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో ఆంథోసైనిన్స్ అనే పదార్థాలు ఉండగా అవి నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండగా వాపును తగ్గించడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఇవి తోడ్పడతాయి.

యాపిల్స్‌లో మాలిక్ యాసిడ్ ఉండగా శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆపిల్ తినడం వల్ల శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బందులు పడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.