నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ లో భారీ వేతనంతో జాబ్స్!

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సింగిల్ విండో ఆపరేటర్, క్లర్క్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. www.unionbankofindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మే 9వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. మిగిలిన అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉండటం గమనార్హం. స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫీల్డ్ ట్రైల్, రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 47,920 రూపాయల వేతనం లభించనుంది.

వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అందులో కెరీర్ వ్యూ ఆప్షన్ ను ఎంచుకుని దరఖాస్తు ఫీజును చెల్లించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంది. 11 సింగిల్ విండో ఆపరేటర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. డిగ్రీ చదిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

జాతీయ స్థాయిలో ఏదైనా క్రీడకు ప్రాతినిథ్యం వహించిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.