తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, క్యాప్సిల్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా రకరకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలో చేసుకుని త్రాగడం ద్వారా మధుమేహం అనేది కంట్రోల్ లో ఉంటుంది. తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలవు. అలాగే శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అజీర్తి సమస్య ఉన్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడితే ఫలితం ఉంటుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంతో పాటు తీసుకుంటే అజీర్తి సమస్య దూరం అవుతుంది. తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్ గా పని చేస్తుంది. మధుమేహంను నియంత్రణలో ఉంచుతుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస కోస వ్యాధులతో బాధపడే వారికి ఇది మంచి ఫలితం ఇస్తుంది. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాస కోస వ్యాధులను నివారించడంలో దోహదపడుతుంది. అర్థరైటిస్ తో బాధపడేవారు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు చాలా వరకు నియంత్రణలో ఉంటాయి. తిప్పతీగ పొడిని పాలలో కలిపి తీసుకుంటే అర్థరైటిస్ సమస్యకు ఉపశమనం అవుతుంది.
తిప్పతీగలో వృద్యాప లక్షణాలు కనబడకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు లాంటివి ఉన్నట్లయితే బాగా తగ్గిస్తుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులు వాడకూడదు. జ్వరం, ఒంటి నొప్పులు లాంటి వ్యాధులు దరిచేరకుండా మంచి రక్షణగా ఈ తిప్పతీగ ఉపయోగపడుతుంది. చూశారుగా దీని యొక్క లక్షణాలు. వెంటనే ఈ చిట్కా ఫాలో అయిపోండి.