డిగ్రీ, జూనియర్ కాలేజ్ లలో ఉద్యోగాలకు టీటీడీ జాబ్ నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విద్యా సంస్థలలో లెక్చరర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వేర్వేరు విద్యా సంస్థలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. డిగ్రీ కాలేజ్ లు, ఓరియంటల్ కాలేజ్ లలో 49 లెక్చరర్ల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా టీటీడీ జూనియర్ కాలేజ్ లలో 29 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 78 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉండగా దరఖాస్తు చేసుకునే వాళ్లు ఈ విషయాలను సైతం గుర్తుంచుకోవాలి. కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి నెట్ లేదా స్లెట్ లో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 370 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది.

డిగ్రీ లెక్చరర్లకు గరిష్టంగా 1,51,370 రూపాయల వేతనం లభించే అవకాశం ఉండగా జూనియర్ లెక్చరర్లకు గరిష్టంగా 1,47,760 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. రాతపరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.