తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఏఈఈ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. డిసెంబర్‌ 19వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఏఈఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బీఈ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్స్ పాసైన వాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని హిందూ మతానికి చెందిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుంది. టీటీడీలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.