భార్యాభర్తల మధ్య ప్రేమ పుట్టి కలకాలం సంతోషంగా ఉండాలంటే ఈ చిన్న పనులు చేయాల్సిందే!

page-love

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సంపాదన వ్యామోహంలో పడి ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి ఈ కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు.ఒకప్పుడు భర్త పనులకు వెళ్లి సంపాదించగా భార్య ఇంటిపట్టునే ఉండి పిల్లలు ఇంటి పనులు చక్కబెడతో భర్తకు కావలసిన సేవలు చేసేది.అలాగే సరదాగా తన భర్తతో పిల్లలతో కలిసి సమయం కేటాయిస్తూ ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే ఇప్పుడు మాత్రం పిల్లలను ఏ స్కూలు హాస్టల్ లో పడేస్తే భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడి కనీసం ఇద్దరు ప్రేమగా మాట్లాడుకోవడానికి కూడా సమయం లేకుండా పోతుంది.

ఈ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎక్కువ కాలం సంతోషంగా కొనసాగదని వారి మధ్య ఎలాంటి ప్రేమ ఉండదని నిపుణులు చెబుతున్నారు. భార్య భర్తల మధ్య బంధం బలపడి వారి మధ్య ప్రేమ చిగురించి ఎక్కువ కాలం పాటు వారి బంధం కొనసాగాలి అంటే భార్యాభర్తల మధ్య ఆత్మీయత, చిలిపి గొడవలు, శారీరక తృప్తి ఇవన్నీ ఉంటేనే భార్యాభర్తల మధ్య బంధం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.

ఈ రోజుల్లో వృత్తిపరమైన బాధ్యతల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు ఏకాంత సమయం ఎక్కువ గడపలేకపోతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగి సంసార జీవితం దెబ్బతింటుంది. దంపతులిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఎక్కువ కాలం నిలవాలంటే పడకగదిలో ఆర్థిక విషయాలు, అనవసరపు విషయాలకు బదులు వారి గురించి, వారి బంధం గురించి మాట్లాడుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఇలా వారి బంధం మొదట్లో ఎంత ప్రేమగా ఉండేవారో వారు ఇచ్చి పుచ్చుకున్నటువంటి కానుకల గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల వారిద్దరి మధ్య తిరిగి ప్రేమ పుట్టి వారి బంధం ఎక్కువ కాలం పాటు నిలుస్తుంది.