నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో టీటీడీలో ఉద్యోగ ఖాళీలు!

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.1,51,000 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం.

టీటీడీ ఓరియంటల్ కాలేజీలలో పని చేయాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ లెక్చరర్ల భర్తీకి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 78 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. డిగ్రీ కళాశాలలో 49 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంటర్ కళాశాలలో 29 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనిష్టంగా రూ.57,100 నుంచి గరిష్టంగా రూ. 1,51,370 పే స్కేల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

ఎస్టీ., ఎస్సీ., బీసి., ఈడబ్ల్యూసీ కేటగిరీల అభ్యర్థులకు ఐదు సంవత్సరాల మినహాయింపు ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రత్యేక ప్రతిభావంతులకు ఏకంగా 10 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.