లైంగిక సమస్యలతో బాధపడేవారు జాజికాయ పొడితో ఇలా చేస్తే సమస్యలన్నీ పరార్..!

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన జాజికాయను జాపత్రి అని కూడా పిలుస్తుంటారు. జాజికాయను సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఆయుర్వేద వైద్యంలో ఎన్నో వ్యాధులను నయం చేయడానికి కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే అన్ని ఔషధ గుణాలు జాజికాయలో పుష్కలంగా ఉన్నందున పురుషులకు ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు. అలాగే జాజికాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు,యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉండి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

జాజికాయ పొడిని అన్ని రకాల వంటల్లోను మరియు సూప్స్, సలాడ్స్, పాలల్లో కలుపుకొని సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం. సెక్స్ సామర్థ్యం తగ్గి సంతానలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకొని సేవిస్తే
నరాల బలహీనత, శీఘ్ర స్కలనం వంటి సమస్యలను తొలగించి లైంగిక సామర్థ్యం పెంపొందడమే కాకుండా వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరిగి సంతానలేని సమస్యను తొలగిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారువ్యాధి ప్రతిరోజు గోరువెచ్చని పాలల్లో టీ స్పూను జాజికాయ పొడి, పసుపు కలుపుకొని తాగితే సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు ,గొంతు నొప్పి, జ్వరం వంటి వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. మరియు జాజికాయలో ఉండే ఔషధ గుణాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి విరోచనాలు, మలబద్దకం, గ్యాస్‌, ఎసిడిటీ తదితర సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో జాజికాయ నుంచి తీసిన నూనెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.జాజికాయ నుంచి తీసే నూనెను మెస్ ఆయిల్ అంటారు.దీన్ని , ఆయుర్వేద వైద్యంలోను మరియు ఆరోమాథెరపీలో ఎక్కువ వినియోగిస్తారు. స్నానం చేసేటప్పుడు జాజికాయ నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఇందులో లభించే స‌య‌నైడిన్స్‌, ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ చర్మ ఆరోగ్యాన్ని రక్షించి చర్మ సౌందర్యానికి పెంపొందిస్తుంది.