రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు.. ఆ పథకానికి అర్హత పొందే అవకాశం?

మన దేశంలో కోట్ల మంది రేషన్ కార్డ్ ను కలిగి ఉన్నారు. రేషన్ కార్డ్ ఉండటం వల్ల ఉచిత రేషన్ ను పొందడంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అంత్యోదయ అన్న యోజన స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండటం గమనార్హం.

ఈ పథకం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 35 కిలోల ధాన్యాన్ని పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా గోధుమలు, చక్కెర, బియ్యం పొందే అవకాశం ఉంటుంది. అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ స్కీమ్ అమలవుతుందని చెప్పవచ్చు. మరో రెండు సంవత్సరాల పాటు కేంద్రం ఈ స్కీమ్ ను పొడిగిస్తోంది.

తక్కువ ధరకే శాశ్వత ఆదాయ వనరులు లేని పేద ప్రజలకు ఈ రేషన్ కార్డ్ ద్వారా సరుకులు అందిస్తారు. ఎలాంటి ఆస్తులు లేని వాళ్లు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వితంతువులు, ఎలాంటి ఆదాయ వనరులు లేని వాళ్లు ఈ రేషన్ కార్డ్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. శాశ్వత ఇల్లు లేని ఏడాదికి 20 వేల కంటే తక్కువగా ఉన్న, రేషన్ కార్డ్ లేని వాళ్లు ఈ రేషన్ కార్డ్ తీసుకోవడానికి అర్హులు.

అంత్యోదయ రేషన్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు రేషన్ కార్డ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని నిత్యావసర సరుకులు తీసుకుంటే మంచిది. ఇప్పటివరకు ఈ అర్హతలు ఉండి రేషన్ కార్డ్ లేని వాళ్లు వెంటనే రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.