మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటనే సంగతి తెలిసిందే. కాలేయం ఆరోగ్యంగా ఉంటే మాత్రమే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంలో ఫెయిలవుతున్నారు. వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిసినా ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
చెడు ఆహారపు అలవాట్లు, సరిగా నిద్రపోకపోవడం, ధూమపానం తరహా అలవాట్లు ఉన్నవాళ్లకు కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కల్తీ మద్యం తాగడం వల్ల కూడా కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత్రి సమయంలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే ఆ సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిది. కాలేయ సంబంధిత చికిత్సలకు ఖర్చు కూడా ఎక్కువవుతుంది.
రాత్రి సమయంలో కాళ్ల కింది భాగంలో వాపు తరహా లక్షణాలు కనిపిస్తే కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. వాపు, నొప్పి ఎక్కువగా ఉంటే కాలేయ సమస్యలతో ఇబ్బంది పడక తప్పదని చెప్పవచ్చు. మూత్రం రంగు మారడం కాలేయం దెబ్బతినడానికి సంబంధించిన లక్షణాలలో ఒకటని చెప్పవచ్చు. మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారితే వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలి.
వికారం, వాంతులు వంటి సమస్యలు తరచూ వేధిస్తున్నా కాలేయ సంబంధిత సమస్యలు అని చెప్పవచ్చు. చర్మంపై దురద తరహా సమస్యలు తరచూ వేధిస్తున్నా వెంటనే అప్రమత్తం అయితే మంచిది. తరచూ కడుపునొప్పి సమస్య వేధిస్తున్నా కొన్నిసార్లు కాలేయ సమస్య కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి