ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఒకటి. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల గౌట్ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే గౌట్ సమస్యతో బాధ పడతారో వాళ్లకు కాళ్లు, చేతులలో ఎముకలు బయటకు పొడుచుకు వచ్చినట్టు ఉండే అవకాశం అయితే ఉంటుంది. వాము గింజలు రక్తంలోని యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో తోడ్పడతాయి.
సాధారణంగా వాము గింజలను వేర్వేరు వంటకాల తయారీలో వినియోగిస్తారు. వాము తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రోటీన్, ఫైబర్, కొవ్వు, ఫాస్పరస్, నికోటినిక్ యాసిడ్ ను నియంత్రించడంతో పాటు యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో ఇవి సహయపడతాయి. వాములో లుటియోలిన్, 3 – ఎన్- బ్యూటిల్పలైడ్స్ , బీటా-సెల్లినిన్ అని పిలవబడే సమ్మేళనాలు యూరిక్ యాసిడ్ లో ఉంటాయని చెప్పవచ్చు.
ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వాము నీటిని తాగితే యూరిక్ యాసిడ్ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఆ నీటిని వడగట్టి తాగాలి. దీనికి అల్లం కూడా జోడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎసిడిటీ, మలబద్దకం సమస్యతో బాధపడేవారికి వాము నీరు దివ్యౌషధంగా పని చేస్తుందని చెప్పవచ్చు.
వాము నీటిని తీసుకోవడం ద్వారా మలబద్దకం, ఎసిడిటీ సమస్యలు సైతం దూరమవుతాయి. వాము నీరు కీళ్ల నొప్పుల సమస్యలకు సైతం చెక్ పెడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యల నుండి వాము నీరుతో ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. , జలుబు, గొంతు నొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో వాము నీరు తోడ్పడుతుంది.