ఈ వస్తువులను పొరపాటున కూడా వంటగదిలో ఉంచకూడదు…?

సాధారణంగా మనిషి జీవితంలో తరుచూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక సమస్య తీరిపోయిందని అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలు తొందరగా తీరిపోతాయి కానీ కొన్ని సమస్యలు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తీరవు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటి దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా సమస్యలకు పరిష్కారం దొరకదు. అయితే ఇలా ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా వెంటాడటానికి వాస్తు దోషం కూడా ఒక కారణం. మనం ఇంట్లో ఉంచే వస్తువులు వాస్తు ప్రకారం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.

మన ఇంట్లో వాస్తు నియమాల ప్రకారం వస్తువులు ఉంచకపోవడం వల్ల వాస్తు దోషం ఏర్పడి అనేక సమస్యలు తలెత్తుతాయి. మనం ఇంట్లో ఉంచి చిన్న చిన్న వస్తువులు వాటి స్థానంలో కాకుండా వేరే స్థానంలో ఉన్నా కూడా సమస్యల టీ ప్రతాప్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండగలో కొన్ని రకాల వస్తువులను అస్సలు ఉంచరాదు. పొరపాటున ఆ వస్తువులను వంటగదిలో ఉంచటం వల్ల అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఏ వస్తువులను వంటగదికి దూరంగా ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా వంటగదిలో వంటకు అవసరమైన సామాన్లు కూరగాయలతో పాటు కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా మనం ఉపయోగించే మందులు కూడా పెడుతూ ఉంటాము.

వాస్తు ప్రకారం వంట గదిలో మెడిసిన్లను పెట్టడం వల్ల దోషాలను కలుగజేస్తాయి. అందువల్ల వంటగదిలో మెడిసిన్స్ ఉంటే వెంటనే వాటిని తీసివేయాలి..లేదంటే కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యలతో బాధ పడక తప్పదు. వాస్తు దోషం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే బూడిద గుమ్మడికాయ వేలాడు తీయాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం తొలిగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలిగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతో కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.