కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన చిట్కాలివే.. ఈ చిట్కాలతో ఎన్నో ప్రయోజనాలు!

కంటిచూపును మెరుగుపరిచేందుకు, పోషకాలున్న ఆహారం, కంటి వ్యాయామాలు, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, రక్షణ కళ్లద్దాలు ధరించడం, తగినంత నిద్ర, మరియు కళ్ళను శుభ్రంగా ఉంచుకోవడం వంటి చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితలను పొందవచ్చు. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా కంటిచూపు మెరుగుపడుతుంది.

పాలకూర, క్యారెట్, బచ్చలికూర, బ్రోకలీ, గుమ్మడికాయ, చేపలు, కోడి గుడ్లు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ధూమపానం మానేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. 20 -20 -20 నియమాన్ని పాటించడం ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం మంచిది. కంటిని పైకి, క్రిందికి, ఎడమ, కుడికి తిప్పడం, కనుగుడ్లను తిప్పడం, సుదూర వస్తువులపై దృష్టి పెట్టడం వంటి కంటి వ్యాయామాలు చేయడం ద్వారా కంటికి మేలు జరుగుతుంది. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసి కంటి ఒత్తిడిని తగ్గించడానికి తరచుగా విరామం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రమాదకర కార్యకలాపాల సమయంలో గాగుల్స్ లేదా సేఫ్టీ గ్లాసెస్ వంటి రక్షిత కళ్లద్దాలను ఉపయోగించడం ద్వారా కళ్లకు హాని కలుగుతుంది. కళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చేతులను తరచుగా కడుక్కుంటూ కాంటాక్ట్ లెన్స్‌లు మరియు కేస్‌ను శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆయుర్వేద చికిత్సలు, ఉదాహరణకు త్రిఫల వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.