నరసింహ స్వామి పానకం స్వీకరించే ఈ గుడి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు రాష్ట్రాలలోని ప్రజలలో ఎక్కువమంది పూజించే దేవుళ్లలో లక్ష్మీ నరసింహ స్వామి ఒకరనే సంగతి తెలిసిందే. లక్ష్మీ నరసింహ స్వామికి తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో గుడులు ఉన్నాయి. మంగళగిరిలో కూడా నరసింహ స్వామి ఆలయం ఉండగా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నరసింహస్వామి పానకం స్వీకరించే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందడం గమనార్హం.

ప్రతిరోజూ వందల సంఖ్యలో భక్తులు ఈ గుడిని దర్శించుకుంటారు. ఈ గుడిలో దేవుడిని దర్శించుకుంటే కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. ఈ గుడిని భక్తులు పానకాల స్వామి గుడి అని కూడా పిలుస్తారు. దేశ విదేశాల నుంచి ఈ గుడికి వేల సంఖ్యలో భక్తులు వస్తారంటే ఈ గుడి గొప్పదనం ఏంటో సులువుగా అర్థమవుతుందనే సంగతి తెలిసిందే. ఈ ఆలయంలో పానకాన్ని నరసింహ స్వామి నైవేద్యంగా స్వీకరిస్తారు.

ఒక రాక్షసుడిని సంహరించి నరసింహ స్వామి ఇక్కడ వెలిశారని సమాచారం. బెల్లం అమృతంతో సమానమైనదని బెల్లంతో తయారు చేసిన పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా ఇస్తున్నామని నరసింహస్వామి ఆలయంలో పని చేసే పూజారులు చెబుతున్నారు. ఏకాదశి రోజున స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని పూజారులు వెల్లడించారు. ఇక్కడ ఎంత పానకం పోసినా ఒక్క చీమ కూడా రాదంటే అది స్వామి మహిమ అని పూజారులు చెబుతున్నారు.

ఈ క్షేత్రం మహిమాన్విత క్షేత్రం అని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని పూజారులు వెల్లడిస్తున్నారు. భక్తులు సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని పూజారులు పేర్కొన్నారు. ఈ స్వామిని పానకాల రాయుడు అని పిలుస్తామని పూజారులు చెప్పుకొచ్చారు. ఇక్కడ స్వామివారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారులు తెలిపారు. స్వామివారు పానకం తీసుకుంటున్నట్టు గుటకల శబ్దం వినిపిస్తుందని పూజారులు చెప్పుకొచ్చారు.