మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలిపే సంకేతాలు ఇవే..?

ప్రపంచంలో అనేకమంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. ఈరోజు పేదవాడిగా ఉన్నారు రేపు ధనవంతుడు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ధనవంతుడు రేపు పేదవాడు కావచ్చు. అయితే అనేకమంది తమ ఆర్థిక సమస్యలను ఎప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పుడు వారి దశ తిరుగుతుంది అని సందిగ్ధంలో ఉంటారు. అయితే మన జీవితంలోకి ధనలక్ష్మి అడుగుపెడుతోంది అని కొన్ని సంకేతాల వలన తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క కుడి భాగం కొట్టుకున్నట్లు అనిపిస్తే వారికి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతం. అలాగే చాలాసార్లు కళ్ళు తిరిగినట్టు అనిపించడం, కుడి చేయి కిందికి జారినట్టు అనిపించడం సంకేతాలు కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి సంకేతాలు తెలిసినప్పుడు ఇంట్లో శుభపరిణామాలు జరుగుతాయని అర్థం చేసుకోవాలి మీ ఇంటి ప్రధాన ద్వారం వెలుపల మందారం మొక్క పెరిగితే మీరు ధనవంతులు అవుతారని సంకేతం. ఇది మీకు డబ్బు ఏదో మూల నుండి వస్తుంది అనేదానికి సంకేతం. మీ ఇంట్లో నల్ల చీమల గుంపు కనిపిస్తే అది ఎంతో శుభసూచకం. ఇంట్లో నల్ల చీమల గుంపు కనిపించడం వలన మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని ఎంతో మంది పెద్దల నమ్మకం.

కుడి చేతి అరచేతిలో దురద ఉంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని సంకేతం.ఇంటి పై కప్పు పైన ఏదైనా విలువైన వస్తువు ఉంచడాన్ని విశ్వప్రదంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం ఇంటి పై కప్పు పైన పక్షి నడిస్తే అది ధనవంతుల అవడానికి సంకేతంగా చెబుతారు. ఇంటి పెరట్లో చెట్లు, బాల్కనీలో పక్షి లేదా పావురం గూడు కట్టుకోవడానికి కూడా ధనవంతులు అవ్వడానికి సంకేతంగా పరిగణిస్తారు.