సాధారణంగా వివాహం తర్వాత భార్య భర్తల మధ్య మంచి అన్యోన్యత ఉండాలంటే వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉంటేనే వారి బంధం మరింత బలపడుతుంది. పురుషులు తమ జీవిత భాగస్వామితో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపినప్పటికీ మహిళలు మాత్రం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరికొందరు మొహమాటానికి కలయికలో పాల్గొంటూ ఉంటారు. ఇలా మహిళలలో లైంగిక ఆసక్తి తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు వారు లైంగికంగా తమ జీవిత బాగస్వామితో కలవడానికి ఆసక్తి చూపడం లేదు అనే విషయాల గురించి నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ క్రమంలోనే పలు సర్వేల ఆధారంగా నిపుణులు మహిళలలో లైంగిక ఆసక్తి తగ్గిపోవడానికి గల కారణాలను తెలియజేశారు.మహిళలు అభద్రత భావానికి గురైనప్పుడు లేదా వృత్తిపరమైన ఒత్తిడి వారిలో అధికంగా కలిగినప్పుడు ఇలా లైంగికంగా పాల్గొనడానికి ఆసక్తి చూపించరని తెలియజేశారు. అదేవిధంగా మహిళలు ఎవరైతే సరైన పోషకాహారం తీసుకోరో అలాంటి వారిలో కూడా లైంగికాశక్తి చాలా తక్కువగా ఉంటుంది.
ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితులు అలాగే కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ అధిక ఒత్తిడికి గురవడం డిప్రెషన్ కి వెళ్లడం వంటివి జరిగిన సమయాలలో కూడా ఇలా చాలామందిలో లైంగికంగా తమ జీవిత భాగస్వామితో కలిసే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు తెలియజేశారు. ప్రతి పది మంది మహిళలు ఒకరు ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ముందుగా తమ నుంచి ఒత్తిడిని మానసిక ఆందోళనలను దూరం చేయాలి మానసికంగా శారీరకంగా ఒకేసారి విశ్రాంతి తీసుకున్నప్పుడు మన జీవిత భాగస్వామితో కలవాలని కోరిక మొదలవుతుందని నిపుణులు తెలియజేశారు.