హైబీపీ, షుగర్ రెండూ వేధిస్తున్నాయా.. ఈ సమస్యలకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హైబీపీ, షుగర్ బారిన పడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరం మొత్తాన్ని ఈ వ్యాధులు గుల్లగా మార్చే అవకాశం ఉంటుంది. హైబీపీ, షుగర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

హైబీపీ, షుగర్ బారిన పడితే ఈ రెండూ అదుపు తగ్గితే నష్టాలు కలుగుతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఈ రెండు వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంటాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న జీవన శైలి వల్ల మనలో చాలామందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ వ్యాధులను మొదట గుర్తించని పక్షంలో మెదడు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

షుగర్ బారిన పడితే రక్త నాళాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేసే తప్పుల వల్ల పక్షవాతం బారిన పడే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజూ గంట సమయం పాటు వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రెండు వ్యాధులు శరీరాన్ని గుల్ల చేస్తాయని చెప్పడంతో పాటు ఇవి కిడ్నీలను పూర్తిస్థాయిలో డ్యామేజ్ చేస్తాయి.

హైబీపీ, షుగర్ వచ్చిన సమయంలో వ్యాధి కారకాలను గుర్తించడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల బీపీ, షుగర్ వస్తే మాత్రం వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఎక్కువగా పనులు చేయడం ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందవచ్చు. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్యలను కొంతమేర అధిగమించవచ్చు.