రిలేషన్ షిప్ లో ఉన్న వారు చేసే అతి పెద్ద పొరపాట్లు ఇవే!

భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సాగిపోయే దాంపత్య జీవితం ఎక్కువకాలం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అలాకాకుండా ఒకరినీ గురించి మరొకరు పట్టించుకోకుండా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ వెళ్తే అనేక సమస్యలు తలెత్తి ఆ రిలేషన్ మధ్యలోనే బ్రేకప్ అవుతుంది.ఇద్దరి మధ్య ఎంత దృఢమైన బంధం ఉన్నప్పటికీ పదేపదే కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు గొడవలు పెద్దవయ్యే అవకాశాలు ఉంటాయి. కావున ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలు మీ లైఫ్ పార్ట్నర్ తో అస్సలు చెప్పకూడదు

భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ప్రేమానురాగాలతో పాటు నమ్మకం, విశ్వాసం గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం సాఫీగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం అయితే ఆ క్షణం ఎవరో ఒకరు కొంత ఓర్పుగా ఉంటే ఆ గొడవ అంతటితో ఆగిపోతుంది.ముఖ్యంగా మీ భార్య తల్లిదండ్రులను మరియు ఆమె తరపు బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరికైనా వారి తరపు బంధువులను ఎగతాళిగా మాట్లాడితే నచ్చదు. మీకైనా సరే అలాగే ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు భార్యాభర్తల మధ్య ప్రస్తావనకు రాకపోవడమే మంచిది.

భార్యాభర్తల మధ్య హద్దులు పెట్టుకుంటే వారి బంధం మరింత దూరం అవుతుంది తప్ప దగ్గర అవ్వదు. ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించుకుంటూ సాగిపోతే సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు.కొంతమందికి ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చడం అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోండి. ఎందుకంటే మీ భార్యను వేరే మహిళతో పోల్చి నీ కంటే ఆమె నయం అన్నట్లు మాట్లాడితే మి భార్య చాలా బాధపడుతుంది. మీతో గొడవ కూడా పెట్టుకోవచ్చు. ఈ విషయం పదే పదే ప్రస్తావనకు వస్తే చివరకు బంధం విడగొట్టుకునే వారవుతారు

మీ భాగస్వామిని పక్కన పెట్టుకొని ఆమెను పట్టించుకోకుండా ఏదో పరధ్యానంలో సోషల్ మీడియాలో మునిగిపోతే మీ మధ్య బంధం మరింత దూరం అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుని మీ భాగస్వామితో సరదాగా గడపడం అలవాటు చేసుకోండి.