ప్రోటీన్లతోనే ఎముకలకు బలం.. ఈ ఆహారాలను తీసుకుంటే ఏకంగా ఇన్ని లాభాలా?

మనలో చాలామంది తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధ పడేవాళ్లు ఆహారం విషయంలో తప్పులు చేయకూడదు. ప్రోటీన్స్ తో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే.

ఎముక పరిమాణంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎముక బలహీనపడిన సమయంలో సరైన స్థాయిలో ప్రోటీన్లు అందడం వల్ల ఎముకకు మేలు జరుగుతుంది. ప్రేగుల్లో కాల్షియంను గ్రహించుకోవడానికి ప్రోటీన్ తోడ్పడుతుంది. మూత్రం ద్వారా కాల్షియంను శరీరం నుంచి బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది.

రోజుకు రెండు కప్పుల చొప్పున ప్రోటీన్ తీసుకోవడం ద్వారా ఎముకలు విరిగే అవకాశాలు తగ్గుతాయి. ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనాల ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇవి తీసుకోవడం ద్వారా ఎముకల ముప్పు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

ఎముకలకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు.  ఎముకల విషయంలో తప్పులు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సమస్యలతో బాధ పడుతూ ఉంటే వైద్యులను సంప్రదించడంతో పాటు తగిన సలహాలు, సూచనలను పాటిస్తే ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.