నిరుద్యోగులకు పోస్టల్ శాఖ తీపికబురు.. పది అర్హతతో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు వయో పరిమితి విషయంలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 63,200 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు చండీగఢ్ లో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. భారతీయ పోస్ట్ ఆర్డర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. https://www.indiapost.gov.in/vas/pages/indiaposthome.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్, పంజాబ్ సర్కిల్, సెక్టార్ 17, చండీగఢ్-160017 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు 100 రూపాయల పోస్టల్ ఆర్డర్ ను జత చేయాల్సి ఉంటుంది.