నిరుద్యోగులకు అలర్ట్.. భారీ వేతనంతో ఎస్బీఐ మేనేజర్ ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 47 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ పాసై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

 

అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే సులువుగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023 సంవత్సరం జూన్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

 

www.sbi.co.in/careers లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు గరిష్టంగా 32 లక్షల రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం కనీసం 8 లక్షల రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.