రైతులకు మరొక శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై నాలుగు శాతం వడ్డీకే రుణాలు..!

20-million-farmers-listed-so-far-for-pm-kisan-dole

దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతులను ఆర్థికంగా ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను ఆమ్లలోకి తీసుకువచ్చింది. ఈ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి నష్టపరిహారం పెట్టుబడి ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన ద్వారా సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరొక శుభవార్త తెలియజేసింది .

రైతుల కోసం ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రైతులు కి కేవలం 4 శాతం వార్షిక వడ్డీ కి వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సరికొత్త స్కీం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్నా రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల నుండి లోన్ తీసుకుని సదుపాయం కల్పిస్తోంది. ఇలా దాదాపు రూ.3 లక్షల వరకు లోన్ రైతులు లోన్ పొందవచ్చు. ఈ పథకం తో ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. రైతులు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.50,000 వరకు బీమా కవరేజీ లభిస్తుంది.

అంతే కాకుండా అర్హత ఉన్న రైతులకు స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ కూడా లభిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రూ.1.60 లక్షల వరకు లోన్ కి మాత్రం ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఇక ఎంత వడ్డీ కి వస్తోందనేది చూస్తే… 7 శాతం వార్షిక వడ్డీ నుంచి లోన్స్ వస్తాయి. అయితే లోన్ తీసుకున్న తర్వాత సకాలంలో లోన్ తిరిగి చెల్లిస్తే 3 శాతం వరకు వడ్డీ మినహాయింపు పొందొచ్చు. ఇలా రైతులు తీసుకున్న అప్పుకు కేవలం 4 శాతం మాత్రమే చెల్లించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23, 2023-24 సంవత్సరాలకు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ స్కీం ద్వారా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.