గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం… ఒక్క రూపాయి చెల్లించకుండా ఆధార్ అప్డేట్!

29_05_2022-aadhar_227546831666951873071

మనదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒక కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా మనం బ్యాంకు లావాదేవీలు జరపాలన్న ఇతరత పనులు చేయాలట తప్పనిసరిగా బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డు ఓటర్ కార్డ్ వంటి వాటిని కూడా ఆధార అనుసంధానం చేయడంతో ఆధార్ ఎంతో కీలకంగా మారిపోయింది. ఇకపోతే ఆధార్ కార్డు విషయంలో ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం చాలా.

సాధారణంగా ఆధార్ కార్డులో మన ఇంటి పేరు పేరు లేదా చిరునామా పుట్టిన తేదీ వంటి విషయాలు తప్పులు రావడం సర్వసాధారణం అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది.ఇలా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలంటే మనం ఆధార్ అప్డేట్ కేంద్రాలలో తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితిలు ఉన్నాయి.అయితే ఇకపై ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఆధార్ అప్డేట్ చేసుకుని వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

ఈ అద్భుతమైన అవకాశం కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది 2023 మార్చి 15 నుంచి 2023 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవచ్చు. ఇలా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలనుకునేవారు మీ ఆధార్ తో పాటు ఇతర ఐడెంటిటీ కార్డు ఏదైనా తీసుకువెళ్లాలి ఓటర్ కార్డ్ లేదా మార్క్స్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని తీసుకెళ్లాలి. ఇక పుట్టిన తేదీ, జెండర్,పేరు వంటి వాటిని పలుమార్లు మార్చకుని అవకాశం కల్పించలేదు వీటన్నింటినీ కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇక మరెందుకు ఆలస్యం ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.