సాయిపల్లవి పేరులో సాయి ఎలా చేరిందో తెలిస్తే షాకవ్వాల్సిందే?

స్టార్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు గ్లామర్ రోల్స్ లో కనిపిస్తూ ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తూ రికార్డ్ స్థాయిలో ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. అయితే సాయిపల్లవి మాత్రం రెమ్యునరేషన్ ను పట్టించుకోకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు. సాయిపల్లవి నటిస్తున్న విరాటపర్వం మరో నాలుగు రోజుల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది.

అయితే తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సాయిపల్లవి జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మే 9వ తేదీ సాయిపల్లవి పుట్టినరోజు కాగా తమిళనాడు రాష్ట్రంలోని కోటగిరిలో ఆమె జన్మించారు. మలయాళ ప్రేమమ్ ద్వారా సాయిపల్లవి ప్రేక్షకులకు పరిచయం కావడంతో ఆమె మలయాళీ అని చాలామంది భావిస్తారు. అయితే తాను తమిళ అమ్మాయినే అని సాయిపల్లవి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

సాయిపల్లవి అసలు పేరు పల్లవి కాగా ఈమె పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడం గమనార్హం. జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన సాయిపల్లవి మన దేశంలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాలలో అవకాశాలు తగ్గితే డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని సాయిపల్లవి భావిస్తున్నారు. సాయిబాబాకు భక్తురాలు కావడం వల్లే ఆమె పేరులో సాయి చేరిందని సమాచారం. ప్రతి సంవత్సరం సాయిపల్లవి పుట్టపర్తిలోని సాయిబాబా ఆలయానికి కచ్చితంగా వెళతారు.

సాయిపల్లవి పేరులో సాయి ఏ విధంగా చేరిందో తెలిసి ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకొని మరెన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సాయిపల్లవి పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.