ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని భావిస్తారు. ఈ క్రమంలో పోస్ట్ ఆఫీస్ లో బ్యాంకులను వివిధ స్కీమ్స్ కింద డబ్బులు పొదుపు చేయడమే కాకుండా జీవిత బీమా పథకాలలో కూడా డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే అనుకోని ప్రమాదాల నుండి రక్షణ పొందటానికి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి ప్రజలు ముగ్గు చూపుతున్నారు. ఈ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా భద్రత మాత్రమే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
తాజాగా ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ (HDFC Life), ఒక కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది .హెచ్‌డిఎఫ్‌సి సహకారం ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం వ్యక్తుల వివిధ అవసరాలను తీర్చే ప్రొడక్టులను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి ప్రవేశపెట్టిన ఈ పాలసీ కింద హామీ ఇచ్చిన మొత్తంలో భాగంగా ప్రతి సంవత్సరం 11 శాతం నుంచి 13 శాతం వరకు గ్యారెంటీడ్ ఇన్‌కం అందజేస్తుంది. కస్టమర్‌లకు క్రమబద్ధమైన, గ్యారెంటీ ఇన్‌కం ద్వారా ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్, గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్‌ను కూడా అందిస్తుంది.
ఈ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే మొదటి సంవత్సరం ప్రీమియంలపై హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ డిస్కౌంట్ అందిస్తుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్(PPT)లో 8, 10 సంవత్సరాలకు 12 శాతం డిస్కౌంట్, 12, 15 సంవత్సరాల PPTకి 15 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా అదనంగా పాలసీ గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్‌ను ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాలలో కూడా అందిస్తుంది. కుటుంబ సభ్యులు ఇన్‌కం బెనిఫిట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. 0 (సున్నా) నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్న వాళ్లు ఈ ప్లాన్ పొందవచ్చు. అయితే ఇది నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని గమనించాలి. ఈ ప్లాన్ వినియోగదాలకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఫైనాన్షియల్ సేఫ్టీతో కార్పన్‌ను బిల్డ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.