ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదిరిపోయే తీపికబురు అందించింది. అగ్నివీర్ ఉద్యోగాల కోసం ఈ ఏడాదికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుండగా మే నెల 20వ తేదీన ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ పరీక్ష జరగనుంది. https://agnipathvayu.cdac.in/av/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చు.
పెళ్లి కాని పురుషులు, స్త్రీలు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణులై 2002 సంవత్ససరం నుంచి 2006 సంవత్సరం లోపు జన్మించిన వాళ్లు ఇందుకోసం తెలంగాణ అవివాహిత పురుష అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి నెల 15వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఏప్రిల్ నెల 17వ తేదీన ఆన్ లైన్ లో కంప్యూటర్ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. అన్ని దశల్లో అర్హతలు సాధించిన వాళ్లను మాత్రమే ఇందుకు సంబంధించి ఎంపిక చేస్తారు. పది పాసైన వాళ్లు అగ్నివీర్ జనరల్ డ్యూటీ కోసం, 50 శాతం మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు అగ్నివీర్ టెక్నికల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ (టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.