మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ అమలవుతున్నాయి. చిన్న మొత్తాలలో ఇన్వెస్ట్ చేయాలని భావించే మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఈ స్కీమ్ ఉంటుందని చెప్పవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ చిన్నమొత్తాల పొదుపు పథకం కాగా మహిళలు ఈ స్కీమ్ లో భాగంగా 2 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాలు కాగా ఈ స్కీమ్ పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
మహిళలు సొంతంగా ఈ స్కీమ్ కు సంబంధించిన అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. 2025 మార్చి 31 లోపల ఫామ్-1 ను నింపి ఈ స్కీమ్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కనీసం 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎప్పుడు డిపాజిట్ చేసినా రెండేళ్ల తర్వాత ఈ స్కీమ్ ద్వారా డబ్బులను పొందవచ్చు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించడం జరిగింది. అవసరం అయితే ఫామ్ ను నింపి 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వీలు అయితే ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఖాతాలలో డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 32,044 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు నెలకు 1350 రూపాయల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి.