ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే అందరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళదు కొందరు ప్రేమికులు మధ్యలోనే ఒకరి పైన ఒకరు విశ్వాసాన్ని కోల్పోయి ఏవేవో కారణాలతో విడిపోతుంటారు.ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. లవ్ బ్రేకప్ తర్వాత చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తూ చెడు అలవాట్లకు బానిసగా మారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో పాటు భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు అలాంటివారు లవ్ ఫెయిల్యూర్ తర్వాత తన భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కొన్ని మార్గాలను చూద్దాం
లవ్ బ్రేకప్ తర్వాత జీవితం శూన్యమైందని కృంగిపోకుండా భవిష్యత్తుపై ఆశలను పెంచుకుంటూ నీకు నచ్చిన మార్గంలో ప్రయాణించడం నేర్చుకోవాలి. అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలవు. విడిపోయిన మీ భాగస్వామి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కుటుంబం ,నీ కెరియర్ పైన ఎక్కువ దృష్టి పెట్టు. అప్పుడే చేదు జ్ఞాపకాల నుంచి తొందరగా బయటపడగలవు. జరిగిపోయిన కాలం గురించి ఎక్కువగా ఆలోచించకుండా జరగబోయే కాలం గురించి మీ భవిష్యత్ పై ఆశలు పెంచుకుంటూ మీ పైన ఆధారపడిన వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచించినప్పుడు లవ్ బ్రేకప్ నుంచి తొందరగా బయటపడగలవు.
ముందు మీ గురించి మీరు తెలుసుకొని మీ బలాలు బలహీనతలు అంచనా వేసుకుని మీకు సరిపోయే పార్టనర్ కోసం మాత్రమే ప్రయత్నించండి. మీ లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకండి ఎప్పుడు మీ చుట్టూ స్నేహితులు, మీ ఆత్మ బంధువులు, మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేటట్లు చూసుకోవాలి అప్పుడే ఆలోచన నుంచి బయటపడగలరు. వీలైతే మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి కొంతకాలం గడపడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన సినిమాలు మీకు ఇష్టమైన పాటలు వింటూ కూడా చేదు జ్ఞాపకాల నుంచి బయటపడవచ్చు. మీ లవ్ బ్రేకప్ విషయంలో అందరిని సలహాలు అడగకండి మీరు నమ్మదగిన వ్యక్తుల దగ్గర అన్ని విషయాలు పంచుకోండి. లవ్ బ్రేకప్ తర్వాత ఆ ఆలోచన నుంచి బయటపడడానికి మీకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా అడుగులు వేయండి.