బ్రేకప్ తర్వాత కూడా సంతోషంగా జీవించాలా.. చెయ్యకూడని తప్పులివే!

angry-argument-breakup-984954

మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో బ్రేకప్ వల్ల బాధ పడుతుంటాం. కొందరు ఆ బ్రేకప్ బాధ నుంచి త్వరగానే కోలుకుని సాధారణ మనిషి అయితే మరి కొందరు మాత్రం ఆ బ్రేకప్ బాధ నుంచి సులువుగా కోలుకోలేరు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రేకప్ నుంచి కోలుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్రేకప్ విషయంలో కొన్నిసార్లు మన తప్పు ఉంటే కొనిసార్లు అవతలి వ్యక్తుల తప్పు ఉంటుంది.

అవతలి వ్యక్తి నిజంగా తప్పు చేసి ఉంటే బాధ పడకుండా ఉంటే మంచిది. బాధ పడుతూ ఉండటం వల్ల మన జీవితమే నాశనమయ్యే అవకాశం ఉండటంతో పాటు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మనం బాధ పడితే మన కుటుంబ సభ్యులు సైతం కొన్నిసార్లు బాధ పడే అవకాశం ఉంటుంది. మనల్ని కాదనుకొని వెళ్లిపోయిన వాళ్ల కోసం బాధ పడటం మంచి పద్ధతి కాదు.

బ్రేకప్ తర్వాత నిరాశ, నిస్పృహలకు కోను కావడం అస్సలు కరెక్ట్ కాదని చెప్పవచ్చు. నిరాశ నిస్పృహలకు లోనైతే ఆత్మహత్య, ఇతర ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బ్రేకప్ అయితే లైఫ్ ముగిసిపోయిందని అనుకోకూడదు. తప్పు చేసిన వాళ్లకు దూరంగా ఉండటమే మంచిదని చెప్పవచ్చు. బ్రేకప్ వల్ల కొంతమంది కొత్త అలవాట్లకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది.

మందు, సిగరెట్ లాంటి అలవాట్ల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. బ్రేకప్ తర్వాత చాలామంది నెగిటివ్ ఆలోచనలతో ఒంటరిగా ఉంటారు. ఈ విధంగా ఉండటం వల్ల బాధ మరింత పెరుగుతుంది. తప్పు చేయకుండా బ్రేకప్ జరిగితే ఒంటరిగా ఉంటూ బాధ పడాల్సిన అవసరం లేదు.