ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ ఆ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌ (ట్రైనీ) ఉద్యోగ ఖాళీల భర్తీకి సెయిల్ దరఖాస్తులు కోరుతుండగా మొత్తం 314 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. మార్చి 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడంతో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. https://sail.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో బీటెక్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా మిగతా వాళ్లకు 500 రూపాయలుగా ఉండనుంది.

దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ విభాగాల వారీగా పోస్టుల కోసం నోటిఫికేషన్ ను పూర్తిస్థాయిలో చదవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సైతం నివృత్తి చేసుకోవచ్చు.