స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 336 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెల 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 336 అప్రెంటిస్ ఖాళీలలో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 152 ఉండగా టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 136 ఉన్నాయి.
మిగతా ఉద్యోగ ఖాళీలు మాత్రం కేవలం 48 ఉన్నాయి. 2023 సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఐటీఐ అభ్యర్థులు అర్హులు కాగా టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. . గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివిన వాళ్లు అర్హత కలిగి ఉంటారు.
www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెయిల్ అప్రెంటిషిప్-2023 లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ ఆపర్చునిటిస్ అనే లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ గా సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 2409 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.