స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందంటే?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 7.5 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ మొత్తం వడ్డీని పొందే అవకాశం అయితే ఉంటుంది. 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత లక్షా 15 వేల రూపాయల వడ్డీ పొందవచ్చు.

సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేస్తే రూ.1,24,858 పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఏకంగా రూ. 6,24, 858 పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీ అందిస్తున్నాయి.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెండేళ్ల డిపాజిట్ పై ఏకంగా 9.10 శాతం వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. రెండేళ్ల టెన్యూర్ తో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇంత వడ్డీని అందిస్తోంది. డీబీఎస్ బ్యాంకులో 540 రోజులు డిపాజిట్ చేయడం ద్వారా 8 శాతం వడ్డీ లభించే అవకాశం అయితే ఉంటుంది. డచ్చేస్ బ్యాంక్ ఏడాదిన్నర వరకు డిపాజిట్లపై 8 శాతం వడ్డీ లభించనుంది.

కోటక్ మహీంద్రా బ్యాంకులో 23 నెలల టెన్యూర్ పై 7.80 శాతం వడ్డీ లభించనుండగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్లకు 444 రోజుల టెన్యూర్ ద్వారా 7.85 శాతం వడ్డీ లభించే అవకాశాలు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 35 నెలల టెన్యూర్ పై 7.65 శాతం వడ్డీ అందిస్తుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల టెన్యూర్ పై 7.65 శాతం వడ్డీ లభిస్తుంది. ఇండియన్ బ్యాంకులో 400 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.