నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎస్బీఐలో భారీ వేతనంతో కాంట్రాక్ట్ జాబ్స్!

sbi-3-1-2-167419588016x9

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 217 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో రెగ్యులర్ పోస్ట్‌లు 182 ఉండగా కాంట్రాక్ట్ పోస్ట్ లు 35 ఉన్నాయి. ఎస్బీఐ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

మే నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంది. విద్యార్హత, వయోపరిమితి ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

100 మార్కులకు జరిగే ఈ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలోనే వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎస్బీఐ వరుస జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటం గమనార్హం.