చాలా మంది రాత్రి మిగిలిపోయిన రొట్టెలను వృధా చేస్తూ ఉంటారు. రాత్రి చేసిన రొట్టెలు తింటే.. ఆరోగ్యానికి హానికరమని అనుకుంటూ తినగా మిగిలిన వాటిని డస్ట్ బిన్ లో పడేస్తుంటారు… ఇది కొత్త విషయం ఏమీ కాదు.. కానీ ఈ అలవాటు మనకు ఎంతగా నష్టం చేస్తుందో తెలిసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం రాత్రి చేసిన రోటీ మరుసటి రోజు తింటే నిజంగా అమృతంతో సమానమని నిపుణులు అంటున్నారు.
ఆయుర్వేద నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం పాత రోటీని.. ప్రతిరోజూ ఉదయం ఒకటి రెండు తీసుకుంటే డయాబెటిస్, గ్యాస్, మలబద్ధకం, బరువు పెరగడం వంటి సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. రోటీలో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు క్రమంగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది కేవలం షుగర్‌కి మాత్రమే కాదు, ఎక్కువకాలం కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా వరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శక్తి తక్కువగా ఉండే వారికి.. ఇది శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
రొట్టెలను రాత్రి ఫ్రిజ్‌లో పెట్టి, ఉదయం చల్లని పాలలో లేదా పెరుగులో నానబెట్టి తింటే ఇంకా ఆరోగ్యకరమని అంటున్నారు. రుచి కోసం పాలకు బెల్లం గుజ్జు కలపొచ్చు, పెరుగులో నల్ల ఉప్పు జోడించొచ్చు. కానీ శిలీంద్రం పట్టిన రొట్టెలను మాత్రం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు నుంచి మిగిలిన రొట్టెలను పారేయకండి. వాటిని సరియైన రీతిలో వాడితే ఆరోగ్యం బాగుంటుంది, డయాబెటిస్, బరువు సమస్యలతో పోరాడొచ్చు. పాత రొట్టెలతో కొత్త ఆరోగ్యాన్ని ప్రారంభించండి.