ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్- 2024 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఆగష్టు 17 చివరి తేదీగా ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 2006 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, గ్రేడ్ డీ ఉద్యోగాలు సైతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ కానున్నాయి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2006 సంవత్సరం ఆగష్టు 1వ తేదీలోపు జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా తప్పులు చేసి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆగష్టు నెల 27వ తేదీన అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ కానుండగా ఆగష్టు 28వ తేదీ అప్లికేషన్ ను కరెక్షన్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాస్ అయితే మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడంతో పాటు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా స్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం అందుతోంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వంటి సెక్షన్స్ నుంచి ప్రశ్నలు ఉండనున్నాయి. దరఖాస్తు చేయడంలో తప్పులు చేసిన వాళ్లు వెంటనే తప్పులను సరిదిద్దుకుంటే మంచిది.