పది అర్హతతో ఏకంగా 26,146 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఈ మధ్య కాలంలో పదో తరగతి అర్హతతో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుండగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిన్నటినుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

మొత్తం 26,146 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబర్ నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జనవరి నెల 1వ తేదీ వరకు దరఖాస్తు ఫీజును చెల్లించే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ పరీక్షను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.

13 ప్రాంతీయ భాషలలో ఈ పరీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది. సీఏపీఎఫ్ తో పాటు అస్సాం రైఫిల్స్, ఎస్.ఎస్.ఎఫ్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో 23,347 పురుషుల కోసం ఉండగా మహిళా కేటగిరీలో 2,799 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు వేతనం లభించనుంది.

23 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. రాతపరీక్ష, పీఈటీ, పీఎస్టీ, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 160 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.