స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 261 గ్రేడ్ సి, గ్రేడ్ డి ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు మేలు జరగనుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగ ఖాళీలకు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ లేదా ఇంగ్లీష్ లో స్టెనోగ్రాఫ్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగ ఖాళీలకు సైతం విద్యార్హత సేమ్ గా ఉండగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు మినహాయింపులు ఉండనున్నాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 మార్కులు, జనరల్ అవేర్ నెస్ 50 మార్కులు, ఇంగీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 మార్కులు మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష వ్యవధి 2 గంటలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇందుకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ నెల 26వ తేదీ ఉద్యోగాలకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.