దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపి కబురు అందించింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (గ్రేడ్-ఎ) ఉద్యోగ ఖాళీలతో పాటు లోయర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్ కు సమానమైన చదువును చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయని సమాచారం అందుతోంది. జనరల్ అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉండనుందని తెలుస్తోంది. టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19,900 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈరోజే ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉందని సమాచారం. https://ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు భారీ స్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది.