సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 733 అప్రెంటిస్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా పదో తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఏప్రిల్ నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చిన్న తేదీగా ఉండనుంది. టెన్త్‌, ఇంటర్‌ మార్కుల మెరిట్‌లిస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://secr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలలో కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 38 ఉంటాయి.

24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. సీఓపీఏ ఉద్యోగ ఖాళీలు 100 ఉండగా ఈ ఉద్యోగాలకు సైతం 24 సంవత్సరాల లోపు వయస్సు ఉండే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌) 10 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎలక్ట్రిషియన్‌ 137 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్‌(మెకానికల్‌) ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా ఫిట్టర్‌ 187 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

మెషినిస్ట్‌ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా పెయింటర్ 42, ప్లంబర్ 25, మెకానికల్‌(ఆర్‌ఏసీ) 15 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎస్‌ఎండబ్ల్యూ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా స్టెనో(ఇంగ్లిష్) ఉద్యోగ ఖాళీలు 27 ఉన్నాయని సమాచారం అందుతోంది. స్టెనో(హిందీ) ఉద్యోగ ఖాళీలు 19 ఉండగా డిజిల్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి. టర్నర్‌ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా వెల్డర్‌ ఉద్యోగ ఖాళీలు 18, వైర్‌మెన్‌ ఉద్యోగ ఖాళీలు 80 ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.