ఈ చిట్కాలు పాటిస్తే కరెంట్ బిల్లు 100 రూపాయలు కూడా దాటదు.. అదిరిపోయే ఐడియా ఇదే!

మనలో చాలామంది అంతకంతకూ పెరుగుతున్న కరెంట్ బిల్లుల వల్ల అనుభవిస్తున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఎక్కువ సంఖ్యలో విద్యుత్ ను వినియోగించే వాళ్లు పెరుగుతున్న కరెంట్ బిల్లుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సౌర విద్యుత్ తో కరెంటు బిల్లు భారాన్ని సులభంగా తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. శ్రీనిధి ద్వారా రుణం ఇచ్చి 60 శాతం సబ్సిడీ ఇస్తుండటంతో సోలార్ పానెల్స్ ను ఏర్పాటు చేసుకుని సులువుగా బెనిఫిట్స్ పొందవచ్చు.

ప్రతి నెల స్త్రీనిధి డబ్బులు 2800 చెల్లించడం ద్వారా ఐదేళ్లలో సోలార్ ప్యానెల్స్ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. 20 ఏళ్ల పాటు సౌరవిద్యుత్ అందే అవకాశం ఉండటంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీనిధి నుంచి సోలార్ విద్యుత్ కు రుణాలు ఇస్తున్నామని స్త్రీనిధి ప్రతినిధులు చెబుతున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 40 శాతం సబ్సిడిలో సౌర విద్యుత్ ప్లాంట్ ను అందిస్తుండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు మరింత పెరిగే అవకాశం తప్ప తగ్గే అవకాశం ఏ మాత్రం లేదు. ఏపీలో ఇప్పటికే వేర్వేరు ఛార్జీల భారం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇంటి అద్దెల కంటే కరెంట్ బిల్లులు వస్తున్నాయని చెబుతున్నారు. చలికాలం, ఎండాకాలంలలో సోలార్ ప్యానెల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. రోజురోజుకు పెరుగుతున్న కరెంట్ బిల్లుల వల్ల చాలామందిపై ఆర్థిక భారం పెరుగుతోంది.

కరెంట్ బిల్లును తగ్గించుకోవడానికి చిట్కాలను పాటించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇంటి అవసరాలకు అనుగుణంగా సోలార్ ప్యానెల్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించే వాళ్లు సోలార్ ప్యానెల్స్ ను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది.