ఎక్కువ సమయం పాటు కూర్చుని పనిచేసే వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని సమస్యలు వస్తాయా?

ప్రస్తుత కాలంలో చాలామంది ఆఫీస్ వర్క్ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చుని పని చేస్తుంటారు. వేర్వేరు కారణాల వల్ల ఎక్కువ సమయం పాటు కదలకుండా పని చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ సమయం పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. 4,81,688 మంది వ్యక్తులపై అధ్యయనం జరిపి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేయడం వల్ల ఊబకాయం, రక్తపోటు, నడుము చుట్టూ కొవ్వు పెరిగే అవకాశం, కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కూర్చుని పని చెసేవాళ్లు ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధగా ఉంటే మంచిది. ప్రతిరోజూ కనీసం గంట పాటు వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎక్కువ సమయం కూర్చుని పని చేసేవాళ్లను కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయని చెప్పవచ్చు. ఎక్కువ సమయం కూర్చోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయి. కదలకుండా పని చేసేవాళ్లు ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఎక్కువ సమయం కూర్చుని పని చేసేవాళ్లలో లైంగిక సంబంధిత సమస్యలు సైతం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కంప్యూటర్స్ ముందు ఎక్కువగా పని చేసేవాళ్లు ఆరోగ్యం విషయంలో తగినంత కేర్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.