మీ పప్పు దినుసుల డబ్బాలలో పురుగులు ఉన్నాయా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

మనలో చాలామంది ఇంట్లో ఉన్న పప్పులు పురుగులు పట్టడం వల్ల ఇబ్బందులు పడతారు. బియ్యం, పప్పులు ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా పప్పులకు పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పప్పులకు పురుగులు పట్టకుండా చేసుకునే అవకాశం ఉంటుంది.

పప్పులను పురుగులు పట్టకుండా రక్షించడానికి ఎండు వేపాకులు ఎంతగానో ఉపయోగపడతాయి. సిల్వర్‌ ఫిష్‌ పురుగులు బట్టలు పాడు చేయకుండా చేయడంలో వేపాకులు తోడ్పడతాయి. పప్పుల డబ్బాలో పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు పెట్టడం ద్వారా పురుగులు పట్టే అవకాశాలు ఉండవు. వెల్లుల్లి రెబ్బలు ఎండిపోతే ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బలను పెట్టడం ద్వారా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడవచ్చు.

పప్పులు స్టోర్‌ చేసే డబ్బాలో ఎండు మిర్చి ఉంచడం ద్వారా పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. 3 ఎండుమిరపకాయలు పప్పుల డబ్బాలలో ఉంచడం ద్వారా ఆ ఘాటుకు పురుగులు పట్టే ఛాన్స్ అయితే ఉండదు. పప్పులు స్టోర్ చేసిన డబ్బాలలో 10 లవంగాలను ఉంచడం ద్వారా పురుగులు పట్టే అవకాశాలు ఉంటాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా పురుగులు పట్టకుండా చేయవచ్చు.

పప్పులను ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసుకోవడం ద్వారా పప్పులు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. బాక్స్ లలో పప్పులను స్టోర్ చేసి ఫ్రిజ్ లో ఉంచితే మంచిది. జిప్‌లాక్ ప్యాకెట్లలో పప్పులను నిల్వ చేస్తే ప్రయోజనం చేకూరనుంది. పప్పులను ఎండలో ఉంచడం ద్వారా పురుగుల బారిన పడకుండా చేయవచ్చు. పప్పులను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.