దుస్తులపై ఉన్న మరకలను పోగొట్టాలా.. అదిరిపోయే సూపర్ చిట్కాలు ఇవే!

మనలో చాలామంది దుస్తులపై ఉన్న మరకల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దుస్తులపై పండ్ల రసాలు, కాఫీ, గ్రీజు, నూనె మరకలు పోగొట్టాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇష్టంగా కొనుక్కున్న దుస్తులు మరకల వల్ల కొన్నిసార్లు వినియోగించడానికి సైతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దుస్తులపై లిప్ స్టిక్ మరకలు పడితే గ్లిజరిన్ రాసి అరగంట తర్వాత ఉతకడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ రక్తం లేదా తుప్పు మరకలను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల ఫాబ్రిక్ రంగు కూడా పోతుందని చెప్పవచ్చు. డిటర్జెంట్, స్టెయిన్ రిమూవర్ బట్టలు ఉతకడానికి ముందు మరకలను స్క్రబ్ చేయడానికి ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. స్టెయిన్ రిమూవర్లు మొండి మరకలను తొలగించడంలో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

దుస్తులపై ఇనుప తుప్పు మరక పడితే అర బకెట్ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి ఉప్పు వేసి ఎక్కువ సమయం నానబెట్టడం ద్వారా ఆ మరకలను శుభ్రం చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేస్తే కూడా ఈ మరకలను సులువుగా శుభ్రం చేయవచ్చు. దుస్తులపై కెచప్ మరక పడితే, దాన్ని డిటర్జెంట్‌తో ఉతికితే సరిపోతుందని చెప్పవచ్చు. బ్రష్ ఉపయోగించి మరక ఉన్నచోట రుద్దితే మరక వెంటనే తొలగి పోతుంది.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా దుస్తులపై మరకలను వేగంగా తొలగించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ చిట్కాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే దుస్తులపై ఉన్న మరకలు వేగంగా శుభ్రమయ్యే అవకాశాలు ఉంటాయి.