గురు పౌర్ణమి రోజు సాయిబాబాను ఇలా పూజిస్తే అంతా శుభమే.. ఏం చేయాలంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి అని పిలవడం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమిని హిందువులు జరుపుకుంటారు. ఈరోజు గురువులకు కానుకలు సమర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కావడంతో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది.

ఈరోజు చాలామంది భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగించడం జరుగుతుంది. పూర్వం సాయిబాబా భిక్షాటన చేసి హితబోధ చేశారని సమాచారం. సాయిబాబాను పూజించి ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది భక్తులు బలంగా బలంగా విశ్వసిస్తారు.

ఎంతో నియమ నిష్టలతో సాయిబాబాను పూజించడం వల్ల మనపై దేవుని అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. సూర్యోదయం కాకముందే తలస్నానం చేయడం ద్వారా దేవుని అనుగ్రహం కలుగుతుంది. భక్తులు ఆకలితో ఉంటే సాయిబాబా చూడలేడని చాలామంది భావిస్తారు. ఇంటిని శుచి శుభ్రతలతో ఉంచుకుంటే సాయిబాబా అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు.

గురు పౌర్ణమి రోజున నోరు లేని మూగజీవులను పూజిస్తే మేలు జరుగుతుంది. ఈరోజు ఆలయానికి వెళ్లలేని వారు సాయి బాబా చిత్రపటానికి నిష్టతో పూజలు చేసి రోజంతా సాయి నామాన్ని స్మరిస్తే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. సాయిబాబాను పూజించడం ద్వారా జన్మజన్మల ఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో సైతం గురు పౌర్ణమిని పండుగలా జరుపుకుంటారు.